వైసీపీ ఓటు బ్యాంకు రాజ‌కీయాలు మాకు తెలీవు: చంద్ర‌బాబు

News Image

వైసీపీ త‌ర‌హా ఓటు బ్యాంకు రాజ‌కీయాలు త‌మ‌కు తెలియ‌వ‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. ద‌ళితుల‌ను ఓటు బ్యాంకుగా చూసిన ఘ‌న‌త వైసీపీదేన‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. వైసీపీ ఓటు బ్యాంకు కార‌ణంగానే ద‌ళితుల్లో ఇంకా అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌న్నారు. కానీ.. తాము అంబేడ్క‌ర్ రాజ్యాంగాన్ని తూచ‌. త‌ప్ప కుండా అమ‌లు చేస్తున్నామ‌ని.. ద‌ళితుల‌కు మెరుగైన సేవ‌లు అందించి. వారిని ఉన్న‌త స్తాయికి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని వివ‌రించారు.  

తాజాగా గుంటూరు జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ‌లో ఉన్న పొన్నేక‌ల్లు గ్రామంలో సీఎం చంద్ర బాబు ప‌ర్య‌టించారు. అంబేద్క‌ర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని రాజ్యాంగ నిర్మాత‌కు నివాళుల‌ర్పిం చా రు. అనంత‌రం నిర్వ‌హించిన స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ఆది నుంచి తాము ద‌ళితుల‌కు అనుకూ లమ‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ మోహ‌న‌చంద్ర బాల‌యోగిని  పార్ల‌మెం టు స్పీక‌ర్‌ను చేశామ‌ని వివ‌రించారు.

అదేవిధంగా విదేశీ విద్య పేరుతో ద‌ళితుల‌ను విదేశాల‌కు పంపించి ఉన్న‌త చ‌దువులు చ‌దువుకునే అవ కాశం క‌ల్పిస్తున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఇప్పుడు పీ-4 ద్వారా అన్ని వ‌ర్గాల పేద‌ల‌ను ఉన్న‌త స్థాయి కి తీసుకువ‌చ్చే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన‌ట్టు తెలిపారు. ఎస్సీ స‌బ్ ప్లాన్ ద్వారా ద‌ళితుల అభ్యున్న‌తికి కృషి చేస్తున్న‌ట్టు వివ‌రించారు. వ‌చ్చే రెండేళ్ల‌లో ద‌ళితులు ఉన్న‌త‌స్థాయికి చేరుకునేలా కార్య‌క్ర‌మాలు రూపొందిస్తున్నామ‌న్నారు.

విద్య, ఉద్యోగంలోనే కాకుండా.. స్వ‌యం ఉపాధి రంగాల్లోనూ ద‌ళితుల‌ను మెరుగైన రీతిలో త‌యారు చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు వివ‌రించారు. గ‌త వైసీపీ త‌ర‌హా త‌మ ప్ర‌భుత్వం ద‌ళితుల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగానే చూడ‌బోద‌న్నారు. ద‌ళితులు అంటే.. స‌మాజంలో ఉన్న‌త వ‌ర్గంగా గుర్తించే రోజు కోసం.. తాను ప‌రిత‌పిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. అందుకే.. అంబేద్క‌ర్ విదేశీ విద్య కానుక ను త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్న‌ట్టు చెప్పారు.

Recent Comments
Leave a Comment

Related News