న్యూ ఈయర్ విషెస్..అవి వద్దన్న చంద్రబాబు

News Image

ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నూత‌న సంవ‌త్స‌రం శుభాకాంక్షలు తెలిపారు. విజ‌య‌వాడ‌ ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన‌ క‌న‌కదుర్గ‌మ్మ‌ను నూతన సంవత్సరం సందర్భంగా చంద్రబాబు ద‌ర్శించుకున్నారు. చంద్రబాబుకు వేదాశీర్వ‌చ‌నాలు పలికిన వేదపండితులు తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. చంద్ర‌బాబుకు అర్చ‌కులు, సిబ్బంది పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు.

ఆ తర్వాత చంద్రబాబు విజయవాడలో రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు వెళ్లారు. కొత్త సంవత్సరం సందర్భంగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అధికారులు వచ్చారు. అయితే, దివంగత ప్రధాని వాజ్ పేయి సంతాప దినాలు నడుస్తున్న సందర్భంగా బుకేలు తేవొద్దని చంద్రబాబు చెప్పారు.

కాగా, నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖ సంతోషాలు తీసుకురావాలని ఏపీ విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. ప్రజలందరికీ లోకేష్ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. విధ్వంసకర నియంతృత్వ పాలనను ప్రజలు గత ఏడాది తరిమికొట్టి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించుకున్నారని అన్నారు.

Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News