సీమాంధ్ర రగులుతోంది

July 30th, 2013

Bhindi

Seemandhra map

తెలంగాణ ప్రకటనతో సీమాంధ్ర భగ్గుమంది. తెలంగాణకు అనుకూలంగా అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అత్యంత హేయమైనది… సీమాంధ్రలో ఆ పార్టీ ఇక చరిత్రలో కలిసిపోతుందని సీమాంధ్రులు స్పష్టంచేశారు. సీమాంధ్రలో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. హిందూపురంలో బస్సులు, లారీలను ధ్వంసం చేశారు. ఒక లాడ్జి అద్దాలు పగిలాయి. కర్నూలు నగరంలో విధ్వంసాలు చెలరేగాయి. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈరోజు ఆంధ్రా యూనివర్సిటీ వద్ద సోనియా గాంధీ దిష్టిబొమ్మ దహనం దహనం చేశారు. భారతదేశం గురించి తెలియన ఆ అజ్ఞాని వల్ల దేశం పాడైందని తీవ్రంగా దుమ్మెత్తిపోశారు. తిరుపతిలో సమైక్యవాదులు ధర్నా చేపట్టారు. గుంటూరులో ఉద్రిక్తతలు ఏర్పడటంతో అక్కడ 144 సెక్షన్‌ విధించారు. ముందు జాగ్రత్తగా సచివాలయం, అసెంబ్లీ, సీఎం క్యాంపు ఆఫీసుల వద్ద కూడా బలగాలు మొహరించాయి.ఇదిలా ఉండగా బుధవారం సీమాంధ్ర బంద్ కు అన్ని పార్టీలు, జేఏసీ పిలుపునిచ్చింది.

 Tags: , ,Ads
e-Paper